వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం భారీ వర్షం కురుస్తోంది. ఆమదాలవలస, సరుబుజ్జిలి, పాతపట్నం, బూర్జ, పాలకొండ, నరసన్నపేట, తదితర మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లాలో ఇన్ని రోజులు వర్షాలు లేక వరి పంటలు ఎండిపోవడంపై రైతులు ఆందోళన చెందారు. ఇవాళ కురిసిన వర్షంతో వరి పంటకు అనుకూలంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: