శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భారీ వర్షం కురుస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీర ప్రాంతంలో కొనసాగుతుండటంతో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. పాలకొండ, యెచ్చార్ల, రంగస్థలం, జలుమూరు, కొత్తూరు, పాతపట్నం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, నరసన్నపేట, జలుమూరు, హిరమండలం, బూర్జ, ఎల్.ఎన్.పేటతో పాటు వివిధ మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
గురువారం ఉదయం నుంచి వాతావరణ మార్పు వచ్చి ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అల్పపీడనం కారణంగా ఒకటి రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈ వర్షాలతో వరి చేనుకు దోమపోటు, చీడ పీడలు సోకకుండా ఉంటుందని ఆమదాలవలస ఏరువాక కీటక శాస్త్రవేత్త డాక్టర్ జి చిట్టిబాబు తెలిపారు.
ఇవీ చదవండి: