వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో నాగావళి, వంశధార నదులు పోటెత్తాయి. రెండు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు. జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేలా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
మెళియాపుట్టి మండలంలో రాధాకంత సాగరం గెడ్డ ప్రవాహానికి, గోకవర్ణపురానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి గురించి, స్థానికులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.
ఇదీ చదవండి: కుండపోత వర్షం.. అపార పంట నష్టం