శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరం గ్రామంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామ సమీపంలోని రాగోలు కృష్ణ, బొత్స ఆదినారాయణకు చెందిన పంట పొలాల్లో గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే.. గడ్డివాములు దగ్ధం అయ్యాయి. సుమారు 50 వేల రూపాయలు విలువ చేసే పశుగ్రాసం కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలిసిరాలేదు.
ఇదీ చదవండి: