శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని రైతులు, చేనేత కార్మికులు శ్రీశైలం మల్లన్న తలపాగాను పట్టణంలో ఊరేగించారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో శ్రీశైలం మల్లికార్జున స్వామికి 365 మూరల తలపాగాను తయారు చేశారు. వినాయకుడికి, అమ్మవారికి కండువాలు సిద్ధం చేశారు. కోట దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు చేనేత కార్మికులు శ్రీశైలం బయలుదేరారు. శ్రీశైలం దేవాదాయ శాఖ అధికారులకు మల్లన్న తలపాగాను అందజేయనున్నారు. శివరాత్రి నాడు స్వామి వారికి ఈ తలపాగాను అలంకరించనున్నారు.
ఇదీ చదవండి: