శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దుప్పలవలస గ్రామంలోని ఓ ఇంట్లో దాచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంటి యజమాని శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ ఇంట్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడని, తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీధర్ చెప్పడంతో నాగరాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిషేధిత ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రూ. 5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత - గట్కా సీజ్ తాజా వార్తలు
రూ. 5 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పోలీసులు పట్టుకున్నారు. ఓ ఇంట్లో దాచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని..,ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు.