ETV Bharat / state

'ఆ మూడు పోర్టులను ప్రభుత్వమే నిర్మిస్తుంది' - bhavanapadu port news

శ్రీకాకుళం జిల్లా భావనపాడుతో పాటు రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవులను ప్రభుత్వమే సొంతంగా నిర్మించనుంది. దీని కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేయనుంది. ప్రతీ పోర్టు పేరుతో ఓ సంస్థను రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన భూములను సంస్థ పేరిట బదిలీ చేయనుంది. వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.3 వేల కోట్ల రుణాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇప్పటికే రామాయపట్నం, మచిలీపట్నంలకు సంబంధించిన డీపీఆర్‌లను తయారు చేసే బాధ్యతను రైట్స్‌ సంస్థకు అప్పగించింది.

Government to take-up ports construction
ఆ మూడు పోర్టులను ప్రభుత్వమే నిర్మిస్తుంది
author img

By

Published : Dec 23, 2019, 7:27 AM IST

శ్రీకాకుళం జిల్లా భావనపాడు ఓడరేవు నిర్మాణాన్ని ఆదానీ సంస్థకు గతంలో అప్పగించారు. సుమారు 2,250 ఎకరాలను సేకరించాల్సి ఉంది. పరిహారం, పునరావాస కార్యక్రమాలకు సుమారు రూ.1,200 కోట్లు ఖర్చవుతుందని తాజా అంచనా. పోర్టు నిర్మాణానికి డీపీఆర్‌ తయారీ సమయంలో రూ.500 కోట్లు సరిపోతుందని ప్రతిపాదించారు. భూసేకరణకు ఇంతకు మించి వెచ్చించడానికి ఆదానీ సంస్థ సంసిద్ధత తెలపడం లేదని తెలిసింది.

మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి 2,895 ఎకరాలను గుర్తించారు. గతంలో నవయుగ సంస్థతో జరిగిన ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ఓడరేవును సుమారు రెండు వేల ఎకరాల్లో చేపట్టనున్నారు. కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దుగరాజపట్నం బదులు దీన్ని చేపట్టాలని ప్రతిపాదించింది.

ఇదీ చదవండీ...

నిరసనలతో భగ్గుమన్న రాజధాని ప్రాంతం

Intro:Body:

port 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.