శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఇందిరాగాంధీ కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సంఘం జిల్లా నేత తిరుపతి కోరారు. గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని, రీసర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు.
ఇది కూడా చదవండి