శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. విశాఖపట్నం నుంచి ఎల్పీజీ గ్యాస్ లోడుతో భువనేశ్వర్ వెళ్తున్న ట్యాంకర్ సింగుపురం జంక్షన్ సమీపంలో డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. టెక్నీషియన్ల సహకారంతో రోడ్డుపై నుంచి ట్యాంకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చదవండి...