ETV Bharat / state

వజ్రపుకొత్తూరులో ముగిసిన వీరజవాన్ అంత్యక్రియలు

author img

By

Published : Oct 23, 2020, 7:00 PM IST

దశాబ్దకాలంగా దేశ సేవకే అంకితమై, నిత్యం సరిహద్దులో కాపలా కాస్తూ... విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించాడు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన ఓ యువకుడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందాడు.

funerals-completed-of-jawan-in-vazrapukotthuru-srikakulam-district
వజ్రపుకొత్తూరులో ముగిసిన వీరజవాన్ అంత్యక్రియలు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన బొంగు బాబూరావు... 2009లో అసోం రైఫిల్స్‌లో జవానుగా చేరి అరుణాచల్‌ప్రదేశ్‌లోని భోన్సా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వివాహం చేసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వగ్రామానికి వచ్చారు. అదే నెల 14న తాటిపట్టికి చెందిన మీనాక్షిని పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబరు 27న విధుల్లో చేరేందుకు సరిహద్దుకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మెడకు బుల్లెట్ తగిలి మృతి చెందారు.

శోకసంద్రంలో కుటుంబీకులు...

విధుల్లో చేరిన మూడు రోజులకే ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. బాబూరావు తండ్రి పురుషోత్తం కొన్నేళ్ల క్రితం చనిపోగా.. తల్లి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

వివాహమైన ఏడు నెలలకే...

వివాహమైన ఏడు నెలలకే మృత్యుఒడికి చేరుకున్నప్పటికీ.. దేశ రక్షణ కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందని బాబూరావు భార్య మీనాక్షి... అనడంతో అక్కడ ఉన్నవారందరూ గర్వపడ్డారు. బాబూరావు స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్లొన్నారు.

ఇదీచదవండి.

నవంబర్‌లో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్‌' మూడో దశ ట్రయల్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.