శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గ పురపాలిక ఎన్నికలు రస్తవత్తరంగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థుల్లో నలుగురు.... మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. 4వ వార్డుకు చెందిన వి.శ్రీనివాసరావు, 8వ వార్డుకు చెందిన ఆర్.మురళీకృష్ణ, 20వ వార్డుకు చెందిన బి.వెంకటలక్ష్మీ, 29వ వార్డుకు చెందిన సనపల దీప్తి భర్త....వైకాపాలో చేరారు.
4వ వార్డులో మరో అభ్యర్థిని వి.మనీష తెలుగుదేశం తరపున నామపత్రాలు దాఖలు చేసినా వైకాపా తీర్థం పుచ్చుకున్నశ్రీనివాసరావు కుమార్తె కావటంతో ఈ వార్డు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన వార్డుల్లో తెదేపా తరపున పోటీలో ఉన్న అభ్యర్థులను సైతం విత్‌డ్రా చేయించేందుకు వైకాపా వ్యూహం పన్నడంతో తెదేపా నాయకులు అప్రమత్తమయ్యారు. పలాసలో ఛైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వజ్జ బాబురావు ఇంటి వద్ద శనివారం సమావేశమయ్యారు. వైకాపా బెదిరింపులకు పాల్పడి అభ్యర్థులను తీసుకు వెళుతుందని తెదేపా నాయకులు పేర్కొనడంతో.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్‌శివాజీ మిగిలిన అభ్యర్థులను వాహనాల్లో రహస్య ప్రాంతానికి తరలించారు.
ఎన్నికలు గెలిచిన తర్వాత ఛైర్మన్ ఎంపిక విషయంలో గతంలో అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించడం పరిపాటి. ఈ సారి ఎన్నికలు జరగకముందే అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించటంతో ఎన్నికల వేడి రాజుకుంది.
ఇదీ చదవండి