ETV Bharat / state

మూడేళ్లకొకసారే పెళ్లి బాజాలు.. తమ ఊరివారితోనే వివాహ సంబంధాలు - శ్రీకాకుళం జిల్లాలో సామూహిక వివాహాలు

ఆ ఊరిలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే పెళ్లి బాజాలు మోగుతాయి. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులంతా ఒకేరోజు మనువాడతారు. సంబంధాలూ తమ ఊరివారితోనే కుదుర్చుకుంటారు. ఒకటి కాదు రెండు కాదు. తరాలుగా ఈ సామూహిక కల్యాణాల ఆచారాన్ని నిష్టగా పాటిస్తున్నారు. ఆ అరుదైన శుభముహూర్తం మరోసారి వచ్చిన వేళ ప్రత్యేక కథనం.

forty-two-pairs-marriage-in-nuvvalarevu-srikakulam-district
మూడేళ్లకొకసారే పెళ్లి బాజాలు.. తమ ఊరివారితోనే వివాహ సంబంధాలు
author img

By

Published : Feb 15, 2021, 5:33 AM IST

పిల్లలకు పెళ్లిళ్ల విషయంలోనూ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులోని నువ్వలరేవు అనే ఊరు తరాలుగా పాటిస్తున్న ఐక్యత అబ్బురపరుస్తోంది. 34 వీధులు, 4 వేల 8వందల గడపలు, 12 వేల మంది జనాభా గల విశాలమైన ఈ గ్రామంలో యువతీ యువకులందరికీ ఒకేరోజు వివాహాలు జరుగుతాయి. కట్టుబాట్లను కచ్చితంగా పాటించే వారంతా తమ గ్రామంలోని వారితోనే సంబంధాలు కుదుర్చుకుంటారు. మూడేళ్లకు ఒకసారి మాత్రమే సామూహికంగా బాజాభజంత్రీలు మోగే ఆ అరుదైన ఘట్టం రానే వచ్చింది. ఈ తెల్లవారుజామున 2 గంటల 36 నిమిషాలకు 42 జంటలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి.

వినూత్న పెళ్లితంతు...

పెళ్లితంతు కూడా వినూత్నంగానే సాగుతుంది. ధాన్యపు గింజ ఆకారంలో ఉండే ఆభరణాన్ని అమ్మాయి, అబ్బాయి మెడలో కడుతుంది. పెళ్లైన మూడు మాసాల్లోపు ఆ ఆభరణాన్ని కరిగించి మంగళసూత్రంలా తిరిగి ధరిస్తుంది. కట్నం తీసుకొనే ఆచారానికి వారు దూరం. అయితే... లాంఛనాలు, సారె ఘనంగానే ఉంటాయి.

మూడేళ్లకొకసారే పెళ్లి బాజాలు.. తమ ఊరివారితోనే వివాహ సంబంధాలు

ఒడిశా నుంచి వలస...

సుమారు 3వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామస్థులు... మత్స్యకారుల్లోని ఒక తెగకు చెందిన వారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని గ్రామాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచే ఈ పెళ్ళిళ్ల ఆచారం అమలవుతున్నట్లు చెబుతున్నారు. ఇంట్లోని మగవాళ్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్తే... మహిళలు వాటిని విక్రయిస్తారు. ఐక్యతకు ప్రాణమిచ్చే ఈ ఊరిలో.... స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవమే. సాధారణ ఎన్నికల్లోనూ ఒకే పార్టీకి ఓటేస్తారు.

ఇదీచదవండి.

తెదేపా మద్దతుదారుల నామినేషన్ల తిరస్కరణపై ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.