వైకాపా సర్కారు వైఫల్యాలపై శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి 12 గంటల దీక్ష చేస్తున్నారు. అరసవల్లిలోని ఆమె ఇంట్లో.. నియోజకవర్గ నాయకులతో కలిసి సామాజిక దూరం పాటిస్తూ.. దీక్షలో కూర్చున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేదలకు ఆర్థిక సహాయం అందిచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నగర శివార్లలో పేట్రేగిపోతున్న పేకాట రాయుళ్లు