శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో... నిషేధిత లంకపిండి విక్రయం జరగుతుందన్న సమాచారంతో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి నుంచి వచ్చిన జాయింట్ ఫుడ్ కంట్రోలర్... కేఎన్ స్వరూప్ ఆధ్వర్యంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు. ఒడిశా నుంచి సరిహద్దు గ్రామాల్లోకి అక్రమంగా తీసుకొచ్చే లంకపిండిని... శనగపిండిలో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పాతపట్నం ప్రధాన రహదారిలోని దుకాణాల్లో తనిఖీలు చేసి... నమూనాలు సేకరించారు. లంకపిండి వాడటం కారణంగా... ధనుర్వాతం, అంధత్వంతోపాటు పలు వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. అందుకే రాష్ట్రంలో దీన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఎర్రమట్టి సరఫరాపై ఆంక్షలు ఎత్తివేయాలి'