ETV Bharat / state

'సైనిక కుటుంబాలకు ప్రతి ఒక్కరూ సహాయపడాలి'

వీర జవానుల కుటుంబాలకు చేయూతను అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Flag Day of the Armed Forces
సాయుధ దళాల పతాక దినోత్సవం
author img

By

Published : Dec 7, 2020, 7:25 PM IST

దేశ రక్షణలో అమరులు, క్షతగాత్రులైన సైనిక కుటుంబాలకు సహాయపడాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైనా ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వీర జవానులకు వందనం సమర్పించారు. సైనిక దళాలు చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తోందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ వారు ప్రదర్శించే ధైర్య సాహసాలు తెగువకు మరో పేరుగా అభివర్ణించారు. ఎంతోమంది సైనికులు దేశరక్షణలో ప్రాణాలర్పించారని..వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ఉదారంగా విరాళాలను అందించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: 'సాయుధ దళాలు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.