శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామంలోని మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. తమ వారిని కరోనా నుంచి రక్షించాలని.. వారు క్షేమంగా తిరిగి రావాలని వేడుకున్నారు. జిల్లాకు చెందిన సుమారు 5 వేల మంది మత్స్యకారులు లాక్డౌన్ కారణంగా గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. అక్కడి ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదని.. కనీసం నిత్యావసర సరుకులు సైతం అందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన మత్స్యకారులకు ఆహారం అందేలా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: