శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయానికి తాళాలు వేసుకొని సిబ్బంది ఇంటికి వెళ్లి పోయారు. ఇంతలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మూడు కంప్యూటర్లతో పాటు మిగిలిన సామగ్రి కాలి బూడిద అయ్యింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు ప్రయత్నాలు చేశారు. పాలకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి.
ఇవీ చదవండి