శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం రెడ్డిపేట లక్ష్మీగణపతి జూట్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. సీజరు మిషన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించినట్లు మిల్లు సిబ్బంది తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కన ఉన్న జనపనారకు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.9 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని జూట్ మిల్లు యాజమాన్యం తెలిపారు.
ఇదీ చదవండి: