శ్రీకాకుళం జిల్లా సోంపేటలో.. ఇచ్ఛాపురం తెదేపా ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు, వైకాపా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సోంపేట ప్రధాన రహదారిలో ఉద్దానం మంచినీటి సరఫరా పైపుల పైన డ్రైనేజీ నిర్మించిన కారణంగా.. తరచూ మరుగు కలుస్తోందని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే అశోక్.. అధికారులతో కలిసి కాలువ పనులు పరిశీలించడానికి వచ్చారు. అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యేకు.. వైకాపా నాయకులు అడ్డు తగిలారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపుతప్పుతుందేమే అని స్థానికులు ఆందోళచెందారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను పంపించివేశారు.
ఇదీ చదవండి: