ETV Bharat / state

తండ్రి చితి ఆరనేలేదు.. అంతలోనే కుమారుడు నదిలో గల్లంతు - Subalai village is an accident

Vamsadhara River: తండ్రి చితి ఆరనేలేదు.. అంతలోనే కుమారుడు నదిలో గల్లంతయ్యాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం.. సుబలయి గ్రామంలో జరిగింది.

Lalit Sagar
లలిత్ సాగర్
author img

By

Published : Oct 28, 2022, 11:10 AM IST

Updated : Oct 28, 2022, 2:14 PM IST

Vamsadhara River: తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు కుమారుడు లలిత్ సాగర్ (30) వంశధార నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలో సుబలయి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఆర్ఆర్ కాలనీకి చెందిన డి.సూర్యారావు దీపావళి రోజున గుండెపోటుతో మరణించాడు.

తన తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు కుమారుడు లలిత్ శుక్రవారం ఉదయం సమీపంలో ఉన్న వంశధార నది వద్దకు చేరుకున్నాడు. కర్మకాండలు నిర్వహిస్తూ నదిలో స్నానం చేసేందుకు దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. గమనించి స్థానికులు నదిలో దిగి వెతకడం ప్రారంభించారు. తండ్రి పోయిన ఐదు రోజులకే కుమారుడు నదిలో గల్లంత కావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు రోదిస్తున్నారు. లలిత్ సాగర్​కు భార్య,.. 9 నెలల కుమార్తె ఉన్నారు.

Last Updated : Oct 28, 2022, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.