యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఎక్కడైనా యూరియా ఉందని సమాచారం అందిచే చాలు అక్కడికి పరుగులు తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పీఎసీఎస్ కేంద్రం వద్ద రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో సామాజిక దూరం లేకుండా ఎరువుల కోసం ఎగబడ్డారు. అన్నదాతలకు అవసరమైన ఎరువులను గ్రామాలకే తరలిస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నా.. ఆచరణకు మాత్రం నోచుకోవటం లేదు.
ఇదీ చదవండి: కిడ్నీ అమ్మి అప్పు తీర్చిన టీచర్.. అయినా!