ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించిన జొన్నలపాడు రైతులు - సంతబొమ్మాళి తహసీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

వంశధార కాలువ నుంచి సాగునీరు అందడం లేదని జొన్నలపాడు గ్రామ రైతులు సంతబొమ్మాళి తహసీల్దార్​ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అధికారులు స్పందించకపోవడం వల్ల లోపలికి వెళ్లి డీటీని నిలదీశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడతామని డీటీ హామీ ఇవ్వగా.. రైతులు వెనుదిరిగారు.

farmers protest at santhabommali mro office in srikakulam district
సంతబొమ్మాళి డీటీ పద్మావతిని కలిసిన జొన్నలపాడు గ్రామ రైతులు
author img

By

Published : Jun 20, 2020, 10:57 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తహసీల్దార్​ కార్యాలయాన్ని జొన్నలపాడు గ్రామ రైతులు ముట్టడించారు. 16వ నంబరు వంశధార కాలువ నుంచి సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్​ కార్యాలయం ఎదుట అధికారులు స్పందించకపోవడం వల్ల లోపలికి వెళ్లి డీటీ పద్మావతిని నిలదీశారు. కాలువలో బండరాళ్లు వేయడం వల్ల సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. సమస్యను అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా... స్పందించడం లేదని వాపోయారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని డీటీ హామీ ఇవ్వడం వల్ల రైతులు వెనుదిరిగారు.

ఇదీ చదవండి :

చర్చి గదుల్లో పార్టీ కార్యాలయాలు వద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.