శ్రీకాకుళం జిల్లాలో రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు జేసీ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతున్నామని మంత్రి దృష్టికి జేసీ తీసుకువెళ్లారు. రైతులకు సమాచారం తెలిసేలా కరపత్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జేసీతో పాటు జేడీఏ శ్రీధర్, మత్స్యశాఖ జేడీ కృష్ణమూర్తి పశుసంవర్ధక శాఖ జేడీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి సుధాకర్‌కు అందిస్తున్న చికిత్సపై అనుమానాలున్నాయి'