శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని అక్కరాపల్లి పంచాయితీ చవితిసీది గ్రామానికి చెందిన... బూర్లె యువరాజ్, ఇందు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. విధికి ఏం అనిపించిందో ఏమో...ఈ కుటుంబాన్ని వంచించింది. యువరాజ్‌కు బోన్ క్యాన్సర్ వచ్చింది. శస్త్రచికిత్స చేసి వైద్యులు ఎడమకాలును తొలగించారు. ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్సార్ భరోసా పింఛను కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అతని పేరు మీద 12 ఎకరాల భూమి వెబ్‌సైట్‌లో ఉండటం వల్ల.... పింఛను మంజూరుకు అర్హత లేదని అధికారులు తేల్చి చెప్పారు. అండగా ఉండాల్సిన అధికారులు ఆదుకోనంటున్నారు. పింఛన్ కోసం... ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భార్య సాయంతో ప్రదక్షిణలు చేస్తూ.... దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమని కార్యాలయం దగ్గరే ఉండిపోతున్నారు. వీరిని ఈటీవీ భారత్ ప్రతినిధి పలకరించేసరికి... కళ్లంట నీళ్లు తిప్పుతూ అసలు విషయం తెలిపారు. తన పేరు మీదున్న భూమిని తొలగించి పింఛను వచ్చేలా చూసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఆ వృద్ధురాలికి అంత కష్టం ఏమెుచ్చిందో..!