ETV Bharat / state

నకిలీ ధ్రువపత్రాలు తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టు - కాశీబుగ్గ తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కేంద్రంగా నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి మోసాలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.

Fake certificates production team arrest
నకిలీ ధ్రువపత్రాలు తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టు
author img

By

Published : Sep 17, 2020, 6:53 AM IST

విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని నకలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలు వెల్లడించారు. కాశీబుగ్గ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని చెప్పిన ఎస్పీ.. జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ సెంటర్ పేరుతో ఇస్తునట్లు తెలిపారు.

కాశీబుగ్గలో ఇల్లు అద్దెకు తీసుకొని కళింగ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఎటువంటి ప్రమాణాలు లేని.. ప్రభుత్వం గుర్తింపు కానీ నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసి విద్యార్థులకు ఇస్తున్నట్టు చెప్పారు. నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి.. డబ్బులు వసూలు చేస్తున్నారని ఎస్పీ అమిత్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.