Experiment to Separate Peanuts from plants: వ్యవసాయంలో వేతనాలు, కూలీల కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు రైతులు చేసిన వినూత్న ప్రయోగం మంచి ఫలితాలనిస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లికి చెందిన దమయంతి... వేరుశెనగ కాయలను, మొక్కల నుంచి వేరు చేసేందుకు సరికొత్త ప్రయోగం చేశారు. వేరుశెనగ కాయలను వేరు చేసేందుకు కూలీల అవసరం లేకుండా మోటార్ సైకిల్ వెనుకభాగంలోని చక్రం ఆధారంగా వేరుశెనగ కాయలు వేరు చేస్తున్నారు. తెలంగాణలో ఆచరణలో ఉన్న ఈ పద్ధతిని ఆచరిస్తూ... వ్యయం, సమయాన్ని ఆదా చేస్తున్నట్లు మహిళా రైతు తెలిపారు.
ఇదీ చదవండి : 'ఇడ్లీ ఇస్తే తినలేదని.. దారుణంగా కొట్టి హత్య చేశారు'