శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యాసర వస్తువులు పంపిణీ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్రావు ఆధ్వర్యంలో సంతకవిటి, వంగరరేగిడి, రాజాం మండలాల్లోని అన్నార్తులకు ఈ సహాయం అందించారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలను గుర్తించి జిల్లా అంతటా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
ఇదీచదవండి.