ETV Bharat / state

అరసవల్లికి చేరిన అమరావతి రైతుల రథం.. సూర్యనారాయణ స్వామికి మొక్కులు - అమరావతి రాజధాని రైతులు

Amaravati Farmers : అమరావతి టూ అరసవల్లి రైతుల పాదయాత్ర ముగిసింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్​ ప్రారంభమైన యాత్రకు అధికార పార్టీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. 60 రోజులపాటు పాదయాత్ర చేయాలని రైతులు సంకల్పించినా.. కొన్ని కారణాలతో రామచంద్రాపురంలో యాత్రను ఆపేశారు. తాజాగా ఆగిన పాదయాత్రను కొనసాగించి అరసవల్లిలో మొక్కలు చెల్లించుకున్నారు.

Amaravati to Asaraveli
అమరావతి టు అసరవెల్లి
author img

By

Published : Apr 2, 2023, 12:58 PM IST

అరసవెల్లి చేరుకున్న అమరావతి రైతుల రథం..ముగిసిన అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర

Farmers Amaravati to Arasavalli Padayatra : జగన్​ మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు ఉద్యమబాట పట్టారు. 1200 రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. రైతులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యను దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రైతులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. రైతుల ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి కావడంతో అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర చేపట్టారు.

పాదయాత్రను గతేడాది సెప్టెంబరు 12వ తేదీన ప్రారంభించారు. 60 రోజుల పాటు 900 కిలో మీటర్లకు పైగా ఈ యాత్ర సాగించాలని అమరావతి రైతులు అనుకున్నారు. రైతులు వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. రాజధాని గ్రామాలకు చెందిన రైతులందరూ పెద్ద సంఖ్యలో 'అమరావతి టూ అసరవల్లి' పాదయాత్రలో పాల్గొన్నారు.

అందరిదీ ఒకే మాట.. వేల గొంతుకలు.. అమరావతే ఆశ, శ్వాసగా రైతులు ఎంతో ఉత్సాహంతో ఈ యాత్రలో పాల్లొన్నారు. అమరావతి అంటే 29 గ్రామాలది కాదు.. ఆంధ్రులందరిదీ అనే ఆకాంక్షను చాటిచెప్పారు. ఆప్యాయతకు శిరస్సు వంచి, లాఠీ దెబ్బలను ఎదురించి, 'అమరావతి టూ అసరవల్లి' వరకూ.. అన్నదాతలు వేసిన అడుగులు ఉద్యమానికి కొత్త ఊపిరి పోశాయి. ప్రతి ఒక్కరి అడుగు అమరావతి రాజధాని వైపుగా ప్రయాణం సాగింది.

ఈ పాదయాత్రలో ఏ రోజు గడపదాటని ఆడవాళ్లు ఉన్నారు. నడవడానికి వాళ్ల శరీరం సహకరించకపోయినా, బీపీ, షుగర్లతో బాధపడే వృద్ధులు వారి చేయూతను ఇచ్చారు. ఇందులో భవిష్యత్‌ను ఆకాంక్షించే యువకులు ఉన్నారు. ఉపాధిని వెతుక్కునే... కూలీలున్నారు. ఇంతమంది కలిసి అడుగేస్తోంది ఒకే దిక్కు. వీరందరిదీ ఒకటే మొక్కు... అమరామతి రాజధాని అని..

కొన్ని కారణాల వల్ల గత సంవత్సరం అక్టోబర్ 22న అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 'అమరావతి టూ అసరవల్లి' రైతుల పాదయాత్ర నిలిచిపోయింది. వెంకటేశ్వర స్వామి రథాన్ని రైతులు రామచంద్రాపురంలోనే నిలిపేశారు. అమరావతి రైతులు రెండో పాదయాత్రగా మార్చి 31న తిరిగి ప్రారంభించారు.

ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి అమరావతి రాజధాని రైతుల రథం చేరుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మహా పాదయాత్ర రామచంద్రాపురంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువచ్చిన అమరావతి రైతులు ఆదిత్యుని ప్రధాన ఆర్చ్ వద్ద వెంకటేశ్వరస్వామి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జై అమరావతి అంటూ సూర్యనారాయణస్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

" న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేయడం జరిగింది. అది జరిగిన వెంటనే హైకోర్టులో తీర్పు రావడం రైతులకు ఒక ఊరట కలిగింది. తరువాత అమరావతి టు అసరవల్లి పాదయాత్ర ప్రారంభించాము. ప్రతి అడుగు, ప్రతి నిమిషం మమల్ని ఇబ్బంది పెట్టారు. మాకు మద్దతు ఇచ్చిన రైతులను, మహిళలను ఇబ్బంది పెట్టారు. " - సతీష్ చంద్ర, అమరావతి జేఏసీ సమన్వయ కమిటీ సభ్యుడు

" అమరావతి టు అసరవల్లి పూర్తి చేశాం.. కానీ ఈ పాదయాత్ర మమల్ని రామచంద్రాపురం దగ్గర ఆపేశారు. మొదటి పాదయాత్ర చాలా విజయవంతంగా జరిగింది. రాజకీయ నాయకులకు లేని ఆంక్షలు మాకు పెట్టారు. " - వరలక్ష్మి, అమరావతి మహిళా రైతు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.