ETV Bharat / state

'తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయాలి' - శ్రీకాకుళంలో మద్యం వార్తలు

ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోడానికి మద్యం దుకాణాలను తెరిచిందని ఎచ్చెర్ల నియోజకవర్గంలో మహిళా సంఘాలు ఆరోపించాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి మందు దుకాణాలను మూసివేయాలంటూ.. రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

due to corona lockdown Echerla constituency Women's associations demad for close the wine shops in Srikakulam

author img

By

Published : May 7, 2020, 4:16 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో పలు మహిళా సంఘాల సభ్యులు, తెదేపా నాయకులు... మద్యం దుకాణాలు మూసి వేయాలంటూ రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. దుకాణాలు తెరిచి కరోనా వైరస్​కి స్వాగతం పలుకుతున్నారని పలువురు మహిళలు మండిపడ్డారు.

మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల తమ కుటుంబాలతో ప్రశాంతంగా ఉన్నామని.. కానీ మళ్లీ తెరచి ఇబ్బందుల్లోకి నెట్టారని వాపోయారు. ఇప్పటికే కరోనా మహమ్మారితో పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు చితికిపోతుంటే.. మద్యం అమ్మకాలతో మరింత రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చేందుతున్నారు.

ఇదీ చదవండి: 'గ్యాస్​ లీకైన​ ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.