శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం జిల్లా పరిషత్ బాలిక పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేద్రంలోని ఓ వలస కూలీ మద్యం సేవించి హల్చల్ చేస్తున్నాడు. పునరావాసంలో ఉన్నవారు బయట తిరిగేందుకు అనుమతులు లేకపోయినా... ప్రతి రోజూ బయటకు రావటమే కాకుండా మద్యం సేవించి వస్తున్నాడు.
ఈయన వల్ల ఇబ్బందులు కలుగుతుండటంతో మిగిలిన వారు లోపలకి రానివ్వకుండా బయటే ఉంచుతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇటువంటి వారి వలన విఫలమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ కేంద్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన 113 మందిని అధికారులు ఉంచారు. ఇప్పటికైనా అధికారులు పునరావాస కేంద్రం నుంచి వ్యక్తులు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.