గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జిల్లా స్థాయి సమావేశం ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించారు. దాసన్న... మా సమస్యలపై దృష్టి పెట్టాలని జిల్లా గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. పారిశుద్ధ్య కార్మికులకు గత ఆరు నెలలుగా వేతన బకాయిలు చెల్లించక ప్రభుత్వ మొండి వైఖరి వ్యవహరిస్తోందని యూనియన్ జిల్లా శాఖ గౌరవాధ్యక్షులు ఆర్ సురేష్ బాబు అన్నారు. ఎమ్మెల్యే, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తొలుత అనాసక్తత చూపిస్తున్నారని ఆరోపించారు. వేతనాలు లేక దయనీయ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని, వేతన బకాయిలు చెల్లించాలని, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి మన్మధరావు, సీఐటీయు జిల్లా కార్యదర్శి చలపతిరావు, నరసన్నపేట శాఖ అధ్యక్షుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...