శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండల కేంద్రంలో గిరిజనులకు అటవీ భూముల పంపిణీ కార్యక్రమాన్ని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం చేపట్టారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 5809 మంది గిరిజనులకు 82 వేల ఎకరాల భూములకు పట్టాలను ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేందుకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. గిరిజనులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీధర్ పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం