శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామంలో గ్రామస్థులు నిరసనకు దిగారు. కిలో కందిపప్పుకు బదులు 770 గ్రాముల పప్పు.. పంపిణీ చేయడంతో ధర్నా చేశారు. రేషన్ ద్వారా పంపిణీ చేసే కందిపప్పులో కోత విధించడంతో ..వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన కవర్లలో కాకుండా పాలిథిన్ సంచుల్లో పప్పును ఉంచి పంపిణీ చేశారు. కొలతలపై అనుమానం వచ్చిన గ్రామస్థులు తూకం వేయడంతో.. భారీ వ్యత్యాసం కనిపించింది. వాలంటీర్లు తమకు సంబంధం లేదని, డీలరు ఇచ్చిన మేరకు పంపిణీ చేశామని చెప్పారు. వారు డీలరు ఉమాపతిని ఫోన్లో నిలదీశారు. వాలంటీర్లు చేసిన తప్పిదంతో తమకు 150 కిలోల కందిపప్పు తక్కువగా వచ్చిందని.., అందుకే కోత విధించాల్సి వచ్చిందని డీలర్ తెలిపారు. కొలతల్లో తేడాపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల ఉప తహసీల్దార్ రాంబాబు తెలిపారు.
ఇదీ చూడండి. తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం