ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవెర్చుతున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన కృష్ణదాస్‌కు.. జిల్లా ముఖద్వారం పైడి భీమవరం నుంచి వైకాపా శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలిలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి ధర్మాన పూలమాలలు వేశారు. ఈనెల 17,18,19 తేదీల్లో ఉత్తరాంధ్రలో కరోనా వ్యాప్తిపై, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: