ETV Bharat / state

'మా పంచాయతీ పరిధిలో మాకే ఇవ్వండి' - శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తాజా వార్తలు

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు స్థలాలు సేకరణపై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తుంటే.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలోని ప్రజలు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో ఆందోళన చేపట్టారు. తమ పంచాయతీ పరిధిలోని స్థలాన్ని తమకు మాత్రమే కేటాయించాలని డిమాండ్​ చేశారు.

dhandu gopalapuram villagers
ఇళ్ల స్థలాల కోసం గ్రామస్థుల ఆందోళన
author img

By

Published : Mar 6, 2020, 2:03 PM IST

ఇళ్ల స్థలాల కోసం గ్రామస్థుల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలోని ప్రజలు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో ఆందోళన చేపట్టారు. ఇతర గ్రామాల ప్రజలకు తమ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని ప్రచారం జరగడం.. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వడ్ఢితాండ్ర, కోటపాడు, కొత్తూరు గ్రామాల ప్రజలు జాగాలు ఆక్రమించి రాళ్లు, కర్రలు పాతారు. బయట పంచాయతీల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సహించేది లేదని, తమ పంచాయతీ పరిధిలో వారికే కేటాయించాలని నినాదాలు చేశారు.

ఇళ్ల స్థలాల కేటాయింపునకు పంచాయతీ హద్దులతో సంబంధం లేదని, ఎక్కడి వారికైనా ఎక్కడైనా స్థలం ఇస్తామని సంతబొమ్మాళి తహసీల్దార్ సోమేశ్వర రావు స్పష్టం చేశారు. తాత్కాలికంగా గ్రామస్థులు పాతిన రాళ్లు, కర్రలను తొలగిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి...

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి పేదల ఆధీనంలోని భూములు స్వాధీనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.