శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న తుపాను ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన.. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో తుపాను ప్రభావంపై సమీక్షించారు. తమ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తీరప్రాంతాల్లో తుపాను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. తీరప్రాంత గ్రామాల ప్రజలను.. అవసరమైతే తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: