శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. నరసన్నపేట సమీపంలోని పైడితల్లి ఆలయం నుంచి మారుతీనగర్ కూడలి వరకు పాదయాత్ర సాగింది. అనంతరం వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. నవరత్నాలు పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణదాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య, కార్యకర్తలు, శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అభివృద్ధి పనులకు సభాపతి తమ్మినేని శ్రీకారం