ETV Bharat / state

' డీలర్లకు వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలి'

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న డీలర్లు.. వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీల మాధవరావు డిమాండ్ చేశారు. డీలర్లకు వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలని ఆయన అన్నారు.

Dealers should be provided with occupational safety and financial security
' డీలర్లకు వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలి'
author img

By

Published : Feb 15, 2021, 2:23 PM IST

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న డీలర్లకు వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీల మాధవరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో డీలర్ల సంఘ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 29 వేల రేషన్ డీలర్లు.. ఇదే వృత్తిగా పని చేస్తున్నారని.. వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ ఎన్నికల ప్రణాళికలో భాగంగా డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశ పెట్టిందని డీలర్ల వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తుందన్నారు. డీలర్ల లాగిన్​లో సరకు లేకుండా ఉన్నట్లు చూపించి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో 16 విడతలుగా సరుకులు పంపిణీ చేసిన కమిషన్​ను ఒకేసారి విడుదల చేయాలని కోరారు. అలాగే కరోనా సమయంలో చనిపోయిన 50 మంది డీలర్లకు గుజరాత్ ప్రభుత్వం ఇస్తున్నట్లు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డు విధానం ద్వారా ఒకే పని విధానాన్ని కల్పించాలన్నారు. తక్షణమే డీలర్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.

ఇదీ చదవండి: నేడు విశాఖకు అమరావతి రైతుల బస్సు యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.