సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించాలని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌ను తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు. ఈమేరకు దిల్లీలో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, రామాయపట్నం ప్రాంతాలకు చెందిన 15 మంది మత్స్యకారులు ఈ నెల 16న గల్లంతయ్యారు. బోటులో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల బోటు సముద్రంలో ఆగిపోయిందని కోస్ట్‌గార్డుకు ఫోన్ చేసినట్లు మంత్రికి చెప్పారు. సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించాలని కోరినట్లు రామ్మోహన్ నాయడు తెలిపారు.
RRR: ఆ రూమర్ నిజం కాదు.. స్పీకర్‌ను కలిసి వివరణ ఇస్తా: ఎంపీ రఘురామ