శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధీలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని పాలకొండ సీపీఎం కమిటీ కార్యదర్శి దావల రమణ రావు అన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే అన్ని రకాల సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్లకి అమ్ముకోవాలని అనుకోవడం దేశ ద్రోహంతో సమానమని దుయ్యబట్టారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 చొప్పున ఆరు నెలల పాటు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం 200 రోజలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే పీఎం కేర్ ఫండ్స్ నిధులను రాష్ట్రాలకు అందించాలన్నారు.
ఇదీ చదవండి :