గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని.. శ్రీకాకుళంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పొట్టి శ్రీరాములు కూడలిలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడంతో సామాన్యులపై భారం పడుతుందన్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: