ప్రేమ వివాహంతో ఒక్కటైన ఆ దంపతులు మూడేళ్లుగా గడవకముందే తనువు చాలించారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రత్తకన్న గ్రామంలో చిరంజీవి (26), లత (24) దంపతులు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులుకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో గత రెండేళ్లుగా ఇచ్చాపురంలో ఉంటున్నారు.
ఇరువురి మధ్య చిన్నపాటి మనస్పర్థలు చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో అయిన వాళ్లకు దూరంగా ఉంటున్నారనే ఉద్దేశంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. మృతుడు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల బాబు.
దంపతులు ఇద్దరూ ఒకే తాడుతో ఉరి వేసుకుని చనిపోయినట్టు గ్రామస్థులు తెలిపారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకు వెళ్లగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: యాప్లో డబ్బులు పెట్టాడు.. రైలు కింద తల పెట్టాడు!