ETV Bharat / state

బొమ్మ పడితేనే బతుకులు మారేది..! - srikakulam district latest news

కొత్త సినిమా విడుదల అవుతుందంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించేది. ఈలలు.. కేరింతలు.. అభిమాన తారల కటౌట్లు.. పాలాభిషేకాలతో సందడి నెలకొనేది. ఇవన్నీ దూరమై దాదాపు ఆరు నెలలైంది. దీనివల్ల థియేటర్ల యాజమాన్యాలు, వాటిపై ఆధారపడిన సిబ్బంది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెరపై బొమ్మ పడితేనే తమ తలరాతలు మారుతాయని వారు చెబుతున్నారు.

theaters
theaters
author img

By

Published : Sep 25, 2020, 7:19 PM IST

సినిమా రంగంపై కరోనా తీవ్ర ప్రభావమే చూపింది. ముఖ్యంగా థియేటర్లు మూతపడటంతో వాటినే నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇటీవల కొత్త చిత్రాలన్నీ ఓటీటీలలో విడుదల అవుతుండటంతో వారి ఆందోళన మరింత పెరిగింది.

శ్రీకాకుళం జిల్లాలో 50కి పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. వీటి వల్ల సుమారు వెయ్యి మందికిపైగా ఉద్యోగులు, కార్మికులు ప్రత్యక్షంగా.. వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కరోనా రాకతో మార్చి 20వ తేదీన మూతపడిన థియేటర్లు ఇంతవరకూ తెరుచుకోలేదు. ప్రస్తుతం ఓటీటీల్లోనే కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది.

అర్థిక భారం... అగమ్య గోచరం

థియేటర్ల యాజమాన్యాలపై నిర్వహణ భారం పడింది. తెరపై బొమ్మ పడకపోయినా విద్యుత్తు చార్జీలు తప్పవు. కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించలేని పరిస్థితి. జీతంలో కోత పడటంతో కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రొజెక్టరు ఆపరేటర్లు, టిక్కెట్‌ గుమాస్తాలు, వాహనాల పార్కింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కాపలాదారులు ఇలా అందరికీ సాయం అందించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై పడింది. దీనికితోడు థియేటర్ నిర్వహణ, ఇతరత్రా వ్యయాలూ ముంచుతున్నాయని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వచ్చే నెలలో తెరిచేందుకు అనుమతి ఇచ్చినా థియేటర్లకు ఎంతమంది వస్తారన్నది ప్రశ్నార్థకమే.

ఆరు నెలలుగా థియేటర్లకు ఆదాయం లేదు. కరెంట్ బిల్లులు మాత్రం నెలకు లక్షన్నర వరకు వస్తున్నాయి. వీటికి తోడు నిర్వహణ ఖర్చులు మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి సమయంలో విద్యుత్తు ఛార్జీల్లో రాయితీలు ఇస్తే మాకు కొంత ఉపశమనంగా ఉంటుంది- వరప్రసాద్‌, కిన్నెర థియేటర్లు కాంప్లెక్స్‌ మేనేజర్‌, శ్రీకాకుళం

నేను 50 ఏళ్లుగా సినిమా వ్యాపారం చేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారితో కష్టాలు మొదలయ్యాయి. అయినప్పటికీ సిబ్బందికి నెలనెలా జీతాలు చెల్లిస్తున్నాం. ఒక్కో థియేటర్​కు నెలవారీ విద్యుత్తు బిల్లులు 50 వేలకు పైనే వస్తున్నాయి. చేయూత అందించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. సర్కార్ సాయం చేస్తేనే మాకు ఇబ్బందులు కాస్త తప్పుతాయి- ‌వరంబాబు, సూర్యమహల్‌ యజమాని, శ్రీకాకుళం

మరోవైపు థియేటర్లు మూతపడటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని థియేటర్ల కార్మికులు అంటున్నారు. ఇంత వరకు యాజమాన్యాలు ఎలాగోలా జీతాలు కొంత శాతం సర్దుబాటు చేశారని వెల్లడించారు. వచ్చే అరకొర ఆదాయం కుటుంబాన్ని నడిపేందుకు సరిపోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి

ఒక్కరోజులో ఎస్పీ ఎన్ని పాటలు పాడారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.