ETV Bharat / state

ఆదాయం తగ్గిందా.. ఆదా చేద్దామిలా..!! - srikakulam latest news

కరోనా అన్ని రంగాలను కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ప్రభుత్వాలు కూడా వైరస్‌ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్లు విధిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అధికశాతం ఉపాధి కోల్పోయాయి. ఆదాయ మార్గాలు మూసుకుపోయి అల్లాడుతున్నారు. ప్రైవేటు ఉద్యోగుల సంగతి చెప్పనవసరం లేదు. కొందరు సగం వేతనాలు అందుకుంటే... మరికొందరు పూర్తిగా జీతాల్లేక అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో తగ్గిపోయిన ఆదాయ వనరులతో కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంతైనా కష్టమే. అందుకు కొన్ని పొదుపు సూత్రాలు పాటిస్తూ...అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక భారం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక అటు ఆరోగ్యం పరంగా, ఇటు ఆర్థికంగా ఎలా మెరుగవ్వాలో తెలుసుకోండి.

ఆదాయం తగ్గిందా.. ఆదా చేద్దామిలా..!!
ఆదాయం తగ్గిందా.. ఆదా చేద్దామిలా..!!
author img

By

Published : Oct 8, 2020, 12:09 PM IST

● కరోనా కాలంలో అనవసర ఖర్చులను నివారిద్దాం..

● చిట్కాలతో ఆర్థిక సమస్యలు అధిగమిద్దాం●

ఉన్నవాటితో సర్దుకుపోదాం..

దశాబ్ద కాలంగా అధికశాతం ప్రజలు బ్రాండెడ్‌ వస్తువులకు అలవాటుపడ్డారు. వీటి ధరలు ఎక్కువగానే ఉంటాయి.
ఇలా చేస్తే..

దేశీయ, స్థానిక ఉత్పత్తులను వాడటం మంచిది. ఇంకా వస్తువులు, సరకులు, దుస్తులు, పాదరక్షలు వంటి విషయంలో ఈ సూత్రాన్ని పాటించి ఖర్చు నియంత్రించుకోవచ్చు.
పరిస్థితికి తగ్గట్లుగా ‘నడుద్దాం’

ఇంటి దగ్గర్లోని దుకాణానికైనా...ఏ చిన్న పనికి వెళ్లాలన్నా ద్విచక్ర వాహనాన్ని వినియోగించడం అలవాటైపోయింది. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌ కోసం ఎక్కువ ఖర్చుచేస్తున్నారు.
ఇలా చేస్తే..

కిలోమీటరు దూరం పరిధిలోని దుకాణాలు, కార్యాలయాలు, పనులకు నడుచుకుంటూ వెళితే డబ్బు ఆదాతో పాటు ఆరోగ్యమూ పొందొచ్చు.
*చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం మానేసి ప్రభుత్వ దవాఖానాలకూ వెళ్లొచ్ఛు.

●*అనవసర ప్రయాణాలు మానుకుంటే ఖర్చులను తగ్గించుకోవచ్ఛు ఫలితంగా ఎక్కువ రద్దీ లేని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండొచ్ఛు.

●*చరవాణి బిల్లులను సగానికి తగ్గించే ప్రయత్నం చేయొచ్ఛు అవసరమైన మేరకే అంతర్జాలం వినియోగించుకోవాలి. అందుకు రాయితీలతో కూడిన డేటా ప్యాక్‌లు ఉన్నాయి.

●*ఓపిక చేసుకుంటే ఇంటి ఆవరణ, మేడ మీద గానీ కొన్నిరకాల ఆకుకూరలు, కాయగూరలు పండించుకోవచ్ఛు ఇటీవల కాలంలో చాలామంది ఈ విధానాన్ని అనుసరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

అటు ఆహారం...ఇటు ఆరోగ్యం
గతంలో వారానికి రెండుసార్లు మాంసాహారం తినేవారు. దీంతో ఖర్చు ఎక్కువవుతోంది.
ఇలా చేస్తే..

వారానికి ఒకసారి మాంసాహారం తీసుకుని మొలకెత్తిన పెసలు, సోయాబీన్, పప్పు దినుసులు తీసుకుంటే ప్రొటీన్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా అందుతాయి.
తక్కువ మొత్తానికే ఎక్కువ పోషకాలు
కరోనా రాకుండా ముందుజాగ్రత్తగా చాలా మంది డి, సి విటమిన్‌ మాత్రలు వేసుకుంటున్నారు. వీటికోసం కుటుంబసభ్యులందరకీ కలిపి రోజుకు కనీసం రూ.100 ఖర్చు పెడుతున్నారు.
ఇలా చేస్తే..

ఉదయం పూట ఓ అరగంట సమయం ఎండలో ఉంటే కావాల్సినంత డి-విటమిన్‌ లభిస్తుంది. కాస్త నిమ్మరసం, పాలకూర, ములగాకు వంటివి తింటే ‘సి’ విటమిన్‌తో పాటు ఇతర పోషకాలూ లభిస్తాయి.ఇక్కడ దొరికే పండ్లతోనే మేలు..
ఖరీదైన యాపిల్, దానిమ్మ వంటి పండ్లను తీసుకుంటున్నారు.
ఇలా చేస్తే..

వీటి బదులుగా తక్కువ ధరకు మన దగ్గరే లభించే జామ, బొప్పాయి, బత్తాయి, సీతాఫలం వంటివి తీసుకోవచ్చు.
ఉప కరణాల వాడకం నియంత్రిద్దాం
ఇంట్లో విద్యుత్తు ఉపకరణాలను ముఖ్యంగా ఏసీలు, ఫ్యాన్లు తదితరాలు అవసరం లేకున్నా వినియోగిస్తున్నారు..
ఇలా చేస్తే..

వీలైనంత వరకు కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో నిద్రిస్తే మంచిది. వాషింగ్‌మెషిన్, ఫ్రిజ్‌లను మితంగా వినియోగిస్తే విద్యుత్తు బిల్లుల భారం తగ్గించుకోవచ్చు.
ఇబ్బందులు ‘కొనితెచ్చుకోవడం’ మానేద్దాం
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం బిర్యానీలు, కూరలు బయటి నుంచి తెచ్చుకోవడం చాలా ఇళ్లలో సర్వసాధారణమైంది. మరికొందరు తల్లిదండ్రులు పిల్లల కోసం ఐస్‌క్రీంలు, కేక్‌లు, ఇతర తినుబండారాలను కూడా తెచ్చిపెడుతుంటారు.
ఇలా చేస్తే..

కొవిడ్‌ నేపథ్యంలో బయటి తిండి ఏమాత్రం క్షేమం కాదని వైద్యులు చెబుతూనే ఉన్నారు.
అవసరానికి మించి ఖర్చు

కరోనా నేపథ్యంలో అధికశాతం మంది పోషకాహారం పేరుతో అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం తీసుకోవడం మంచిది. మాంసాహారం బదులుగా ఆకుకూరలు, పప్పు దినుసులు, పండ్లు తీసుకోవచ్ఛు. - ఎల్‌.నాగరాజు, పోషకాహార నిపుణులు

సగం జీతమే వచ్చేది

నేను ఓ ప్రైవేటు దుకాణంలో పని చేస్తున్నాను. నాకొచ్చే రూ.40 వేల జీతానికి ప్రస్తుతం సగమే వస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనవసర ఖర్చులు తగ్గించుకోవడం అలవాటు చేసుకున్నాం. గతంలో వారానికి రెండుసార్లు తినే మాంసాహారాన్ని ఒకసారికే పరిమితం చేసుకున్నాం. ద్విచక్ర వాహనం వినియోగం తగ్గించేశాం. ఇంట్లో మూడు ఫోన్లున్నా ఒక్కదానికే డేటా రీఛార్జి చేయిస్తున్నాం. - ఎల్‌.రమేష్‌బాబు, పాత హౌసింగ్‌బోర్డు కాలనీ, శ్రీకాకుళం

పొదుపుగా ముందుకు..

నేను, నా భార్య ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో పనిచేస్తుంటాం. ఆన్‌లైన్‌ తరగతులు చెబుతున్నా నాలుగు నెలలుగా సగం వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఆర్థిక సమస్యలను తట్టుకుంటూ పొదుపుగా ముందుకు సాగుతున్నాం. ప్రయాణాలు పూర్తిగా మానేశాం. బయట తిండి ఆపేశాం. - బి.ప్రదీప్‌కుమార్‌, కంచరవీధి, రాజాం

ఆదాయం తగ్గిందా.. ఆదా చేద్దామిలా..!!
ఆదాయం తగ్గిందా.. ఆదా చేద్దామిలా..!!
ఆదాయం తగ్గిందా.. ఆదా చేద్దామిలా..!!
ఆదాయం తగ్గిందా.. ఆదా చేద్దామిలా..!!

ఇదీ చదవండి

ఆర్టీసీ బస్సు కదలదు... రైలు బండిలో ఖాళీ లేదు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.