శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని గణేష్ నగర్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి 14 రోజులైన ఎత్తివేయకపోవటంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. కరోనా వైరస్ వచ్చిన వ్యక్తులు తగ్గడం.. నెగిటివ్ వచ్చిన వారిని అధికారులు ఇంటికి పంపించారని స్థానికులు తెలిపారు. గణేష్ నగర్ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని తక్షణమే అధికారులు స్పందించి కంటైన్మెంట్ జోన్ ఎత్తి వేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ సుధాకర్ తెలిపారు.
ఇది చదవండి శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి!