ETV Bharat / state

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో ఆందోళనలు - srikakulam updates

విశాఖ ఉక్కు కర్మగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. డే అండ్ నైట్ కూడలిలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు భగ్నం చేశారు.

concerns in srikakulam against visakha steel plant privatization
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో ఆందోళనలు
author img

By

Published : Mar 11, 2021, 4:20 PM IST

కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరావు డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో డే అండ్‌ నైట్ కూడలిలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాని పోలీసులు భగ్నం చేశారు. దీనికి నిరసనగా అన్ని ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు నాయకులు ప్రైవేటీకరణను ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మానవహారం చేపట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని.. ప్లాంట్​కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు పాలకొండలో రాస్తారోకో నిర్వహించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని మోదీ అమ్మేస్తాడా?.. ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు అమలు చేయని కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ఉక్కు ఉద్యమం.. దేశవ్యాప్త కార్మిక సంఘాల మద్దతుకు యత్నాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.