ETV Bharat / state

'రైల్వే గేట్​ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి' - ఇచ్ఛాపురం నార్త్ క్యాబిన్ గేటు

ఇచ్ఛాపురం సమీపంలోని నార్త్ క్యాబిన్ గేటు మార్గం వాహనదారులకు, ప్రజలు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. రైల్ నిలయానికి దగ్గరే కావడంతో సిగ్నల్ పడితే చాలు రైళ్లు నెమ్మదిగా సాగుతుంటాయి. నిత్యం రైళ్ల రాకపోకలు ఉంటుండంతో దీంతో దాదాపు అరగంటకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ గేటు నుంచి దాదాపు 18 గ్రామాలకు రాకపోకలు సాగుతుంటాయని.. వంతెన నిర్మించాలని రైల్వే అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

common people facing problems  at railway gates
ఇచ్ఛాపురం రైల్వే గేట్
author img

By

Published : Jan 17, 2021, 7:21 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైలు నిలయానికి కూతవేటు దూరంలోనే నార్తు క్యాబిన్‌ గేటు ఉంటడంతో నిత్యం వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు నిలయానికి దగ్గరే కావడంతో ఆగే రైళ్లు ఇక్కడ నెమ్మదిగా సాగుతాయి. అలానే ఆగని రైళ్లు కూడా స్టేషన్‌ దాటేవరకు నెమ్మదిగానే వెళ్తాయి. ఈ రెండు విధానాలు రహదారి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. తరచూ సిగ్నల్‌ లేదనో, సూపర్‌ఫాస్ట్​ వస్తుందనో గేటును అరగంటకు పైగా వేసి ఉంచుతున్నారు. విద్యార్థులు, వ్యవసాయ కూలీలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని వర్గాల వారు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.

నిత్యం కార్మికులు, విద్యార్థులు, వ్యవసాయ కూలీలకు తప్పని అవస్థ..

ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలలకు విద్యార్థులు చేరాల్సిన సమయం, రైతులు, వ్యాపారుల సమయంలోనే రెండు, మూడు రైళ్లు ఒకేసారి రాకపోకలు సాగిస్తుండటంతో 20 నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. రైలు పట్టాలకు తూర్పున పట్టణం, పశ్చిమాన సినిమా థియేటర్‌, పీచు పరిశ్రమ, రెండు డిగ్రీ కళాశాలలు, ఒక జూనియర్‌ కళాశాల, రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 18 గ్రామాల వారు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. తోటూరు వద్ద వరదనీరు పారే తూములో వాహన రాకపోకలు సాగించేందుకు మండపల్లి గ్రామ పంచాయతీ రహదారిని నిర్మించింది. ఇదీ ఆక్రమణలకు గురికావడంతో నీరు, బురదలతో తూము నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఎగువమార్గ(ఫ్లైఓవర్‌) వంతెన నిర్మించాలనే డిమాండ్‌ వచ్చింది. గతంలో రైల్వే ఉన్నతాధికారులు సర్వే చేశారు. వి.కె.పేటకు ఎదురుగా వంతెన నిర్మించేందుకు అనువుగా ఉందని గుర్తించారు. అందుకు కొంత భూమిని సేకరించాల్సి ఉందని కూడా తమ నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. అయితే కొంత వ్యయభారం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ప్రస్తుత ప్రభుత్వం తన సన్నద్ధతను రైల్వే అధికారులకు తెలియజేస్తే, పనులు ప్రారంభం అవుతాయి. ఆ దిశగా ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించేందుకు నాయకుల కృషి అవసరం.

చాలా ఇబ్బందిగా ఉంది..

కరోనా కాలంలో రైళ్లన్నీ ఆగిపోవడంతో ఈ గేటు మీదుగా రాకపోకలకు ఇబ్బంది లేకపోయింది. అప్పట్లో ఇతర వాహనాలూ లేకపోవడం వల్ల ద్విచక్ర, పాదచారులు తమ గమ్యాలకు చేరేవారు. ఇప్పుడు మళ్లీ రైళ్లన్నీ పునరుద్ధరణ జరుగుతుండటంతో నిత్యం నరకం చూస్తున్నాం.-కె.గోపి, కృష్ణ, తోటూరు, ఇచ్ఛాపురం

ఇదీ చదవండి: దేశరక్షణకు పిడికిలి బిగించిన కందనవోలు వాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.