ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులు పేట సచివాలయాన్ని కలెక్టర్ జె. నివాస్ ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వే వివరాలు, కరోనా పరీక్షలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివేదిక అందించాలని తహసీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు. అనంతరం గ్రామస్థులను సిబ్బంది పని తీరుపై అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:
'కొవిడ్ బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపండి... మౌలిక సదుపాయాలు కల్పిస్తాం'