ETV Bharat / state

'అమెరికా ప్రయోజనాల కోసమే కొవ్వాడ అణుపార్కు'

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో సీఐటీయూ ఆందోళన నిర్వహించింది. కొవ్వాడలో ఏర్పాటుచేయనున్న అణుప్లాంట్ వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని నాయకులు అన్నారు.

citu protest at kovvada
కొవ్వాడలో సీఐటీయూ ఆందోళన
author img

By

Published : Sep 26, 2020, 4:30 PM IST

అమెరికాకు చెందిన కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం కొవ్వాడ అణుపార్కు ఏర్పాటు చేస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేపట్టాలని కొవ్వాడ అణుపార్కు వ్యతిరేక ఉద్యమ కమిటీ కన్వీనర్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. అణుపార్కు రద్దు చేయాలని కోరుతూ.. శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఈ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గకుంటే ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

భూకంపాల జోన్ లో కొవ్వాడ

కొవ్వాడ ప్రాంతం భూకంపాల జోన్​లో ఉందని నేతలు అన్నారు. అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. అణుపార్కు పెడితే యంత్రం లోపం వలన కానీ, మానవతప్పిదం వలన కానీ, ప్రకృతి వైపరీత్యాలు వలన కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుంచి ఒడిశా ఛత్రాపూర్ వరకు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్కడ వ్యతిరేకించారు... ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు!

గుజరాత్ రాష్ట్రంలో పెట్టాల్సిన అణుప్లాంట్ అక్కడ రైతులు, ప్రజలు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు వలన భాజాపా ప్రభుత్వం కొవ్వాడకు తరలించిందని ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు అణువిద్యుత్తు కేంద్రాలు ప్రమాదమని మూసివేస్తుంటే ఇక్కడ పెట్టడమేమిటని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.