CID NOTICE: అమ్మఒడి, వాహనమిత్ర పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, 2022లో లబ్ధిదారులకు ఈ పథకాలు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ తెదేపా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ అధికారులు శనివారం రాత్రి 10 గంటలకు నోటీసులిచ్చారు. 6న ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలన్నారు. పలువురు తెదేపా కార్యకర్తలతోపాటు ఆమెకు కూడా సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులిచ్చారు. చట్టంపై గౌరవంతో తాను విచారణకు హాజరవుతానని శిరీష చెప్పారు.
ఇవీ చదవండి: